కన్నడభామ రుక్మిణి వసంత్ బంపర్ ఆఫర్ కొట్టేసిందని టాలీవుడ్ టాక్. రీసెంట్గా ‘మదరాసి’తో సందడి చేసిన ఈ అందాలభామ ప్రస్తుతం ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. దీనితోపాటు మరో ప్రస్టేజియస్ ప్రాజెక్ట్‌లో కూడా రుక్మిణి భాగం కానున్నట్టు తెలుస్తున్నది. ఆ వివరాల్లోకెళ్తే.. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే.
‘పెద్ది’ తర్వాత రామ్‌చరణ్ చేసే సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో కథానాయికగా రుక్మిణి వసంత్ ఖారారైనట్టు సమాచారం. రీసెంట్గా ‘మదరాసి’ సినిమా ప్రమోషన్స్‌లో తనకు రామ్‌చరణ్ అంటే ఇష్టమంటూ తెగ పొగిడేసింది రుక్మిణి వసంత్. ఆ పొగడ్తలకు అసలు కారణం ఇదేనంటూ ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.