Actress Rukhsar Rehman | బాలీవుడ్ నటి రుక్సార్ రెహమాన్ తన రెండో భర్త ఫరూఖ్ కబీర్‌తో విడిపోయినట్లు తాజాగా ప్రకటించింది. గత రెండు, మూడు రోజులుగా బాలీవుడ్లో వీళ్ళిద్దరూ విడిపోయినట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొచ్చాయి. కాగా ఆ వార్తలను నిజం చేస్తూ రుక్సార్ తాజాగా ఫరూఖ్‌తో విడిపోయానని స్వయంగా వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెల నుంచి తాము విడివిడిగా ఉంటున్నామని, ఇద్దరి అంగీకారం మేరకు ఒక నిర్ణయం తీసుకొని విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించింది. దీని వెనుకున్న కారణాల గురించి చెప్పాలనుకొవడం లేదని ఈ బ్యూటీ తెలిపింది.
రుక్సర్ రెహ్మన్ మొదట అసద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కూతురు ఐషా అహ్మద్. రుక్సర్‌కు, అసద్‌కు మధ్య మనస్పర్థలు రావడంతో వీరిద్ధరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత దర్శక నిర్మాత ఫరుఖ్తో ఆరేళ్లు డేటింగ్ చేసి 2010లో పెళ్లి చేసుకుంది. కాగా గతకొంత కాలంగా వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నట్లు తాజాగా ఈ బ్యూటీ చెప్పింది. పదమూడేళ్ల తర్వాత ఈ జంట విడాకులు తీసుకుంటున్నారు.
రుక్సార్ పదిహేడేళ్లకే హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత రిషీ కపూర్‌తో ఓ సినిమా చేసింది. ఇక ఆ తర్వాత దాదాపు పదమూడేళ్ల వరకు ఇండస్ట్రీలో కనిపించలేదు. మళ్లీ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సర్కార్ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి నేటి వరకు మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా గడుపుతుంది. లేటెస్ట్గా రిలీజైన ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లనూ ఈమె కీలకపాత్ర పోషించింది.