‘చి॥ల॥సౌ’ ‘హిట్ ’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహానీ శర్మ. ప్రస్తుతం ఆమె వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సైంధవ్’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. శుక్రవారం రుహానీశర్మ పాత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘ఈ సినిమాలో రుహానీశర్మ డాక్టర్ రేణు పాత్రను పోషిస్తున్నది. భిన్న భావోద్వేగాల కలబోతగా ఆమె పాత్ర సాగుతుంది. కథాగమనంలో డాక్టర్ రేణు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోష్ నారాయణ్, రచన-దర్శకత్వం: శైలేష్ కొలను.