Rudrudu Movie Ott Release | ‘మునీ-4’ తర్వాత దాదాపు ముడేళ్లు గ్యాప్ తీసుకుని ‘రుద్రన్’ సినిమాతో ఇటీవలే ప్రేక్షకులు ముందుకు వచ్చాడు లారెన్స్. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో మంచి హైప్ క్రియేట్ అయింది. తీరా రిలీజయ్యాక తొలిరోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. హార్రర్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు లారెన్స్‌ను ఇలా యాక్షన్ సినిమాలో చూడలేకపోయారు. రెండు వారాల క్రితం తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలై నిర్మాతలకు బోలెడు నష్టాలను మిగిల్చింది. కథలో కొత్తదనం లేకపోవడం, దర్శకుడు కథిరేషన్ కథనాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దక పోవడంతో వారం తిరిగేలోపే థియేటర్లలో నుంచి వెళ్లిపోయింది.
దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా మే రెండో వారం గానీ లేదంటే మూడో వారంలో గానీ స్ట్రీమింగ్ అవుతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఈ సినిమా డిజిటల్ హక్కులను సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకుంది. ఇక వచ్చే వారంలో ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా తెలుగులో ఈ సినిమాను సీనియర్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు రిలీజ్ చేశాడు.