బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోయంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తుండగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి..
తాజాగా ఈ సినిమా నుండి సర్ప్రైజింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్ కొన్ని స్టన్నింగ్ విజువల్స్ మాత్రమే చూపించి ఆసక్తిని రేకెత్తించారు. నిన్న మేకర్స్ వరుసగా రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ పాత్రల బీటీఎస్ వీడియోలను పంచుకున్నారు. రామ్ చరణ్ లుక్, సీతగా అలియా భట్ ప్రిపరేషన్, అజయ్ దేవగన్ కి సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్ టీం నుండి వచ్చిన అప్డేట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి.
డిసెంబర్ 9న ఆర్ఆర్ఆర్ ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల చేయాల్సి ఉంది. కానీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణంతోపాటు.. కొన్ని అనుకోని కారణాల వలన ఆర్ఆర్ఆర్ ట్రైలర్ వాయిదా వేశారు.