రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో తన సినిమాలపై రెట్టింపు అంచనాలు పెంచారు జక్కన్న. తాజాగా ఆయన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ ( రౌద్రం రణం రుధిరం ) అనే సినిమా తెరకెక్కించారు. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్.
చిత్రంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమా కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ సినీలవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన అది అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. తాజాగా చిత్రం నుండి రెండో సాంగ్‌కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.
నవంబర్ 10న నాటు నాటు అంటూ సాగే పాటను విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అనౌన్స్మెంట్కి సంబంధించి పోస్టర్ విడుదల చేయగా, ఇది ఆక్టటుకుంటుంది. పోస్టర్లో ఇద్దరు చాలా స్టైలిష్‌గా ఉన్నారు.పిక్ తెగ వైరల్ అవుతుంది.