BAFTA 2023: బాఫ్టా నాన్-ఇంగ్లీష్ బెస్ట్ ఫిల్మ్ రేసులో ఆర్ఆర్ఆర్
RRR longlisted for BAFTA ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది. అవార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు షార్ట్‌లిస్టు అయిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్.. ఇప్పుడు మరో ప్రతిష్టాతక అవార్డు కోసం కుస్తీపడుతోంది. రాజమౌళి దర్శ
లండన్: ఆర్ఆర్ఆర్ అదరగొడుతోంది. అవార్డుల వేటలో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులకు షార్ట్‌లిస్టు అయిన ఆర్ఆర్ఆర్ ఫిల్మ్.. ఇప్పుడు మరో ప్రతిష్టాతక అవార్డు కోసం కుస్తీపడుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రిలీజైన ఈ ఫిల్మ్.. తాజాగా బాఫ్టా ( బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరింది.
ఆర్ఆర్ఆర్ నిర్మాతలు ఈ విషయాన్ని తమ ట్విట్టర్లో తెలిపారు. బాఫ్టా లాంగ్‌లిస్టులో ఆర్ఆర్ఆర్కు చోటు దక్కడం సంతోషకరమని, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఆ చిత్ర నిర్మాతలు తమ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. బాఫ్టాలో తొలుత లాంగ్ లిస్టును ప్రకటిస్తారు. ఆ తర్వాత నామినేషన్లను, ఆ తర్వాత ఓవరాల్ విన్నర్‌ను వెల్లడిస్తారు. అయితే బాఫ్టా నామినేషన్లను జనవరి 19వ తేదీన ప్రకటించనున్నారు. ఇక అవార్డులను ఫిబ్రవరి 19వ తేదీన ప్రకటిస్తారు.
బాఫ్టా నాన్ ఇంగ్లీష్ లాంగ్‌లిస్ట్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్తో పాటు ఆల్ క్వయిట్ ఆన్ ద వెస్ట్రన్ ఫ్రంట్, అర్జెంటీనా, 1985, బార్డో, ఫాల్స్ క్రానికల్ ఆఫ్ ఎ హ్యాండ్‌ఫుల్ ఆఫ్ ట్రుత్స్, క్లోజ్, కోర్సేజ్, డిసిజన్ టు లీవ్, ఈవో, హోలీ స్పైడర్, ద క్వయిట్ గర్ల్ పోటీపడుతున్నాయి. బాఫ్టా లాంగ్ లిస్టుకు 10 చిత్రాలను ఎంపిక చేశారు. దీంట్లో చివరకు 5 సినిమాలను అవార్డుకు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత విన్నర్‌ను ప్రకటిస్తారు.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లు వసూల్ చేసింది. గోల్డెన్ గ్లోబ్‌తో పాటు ఆస్కార్స్ రేసులోనూ ఈ ఫిల్మ్ పోటీపడుతోంది. జనవరి 11వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవానికి రామ్, ఎన్జీఆర్ హాజరుకానున్నారు. గోల్డెన్ గ్లోబ్లో బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌తో పాటు నాటు నాటు సాంగ్‌కు మ్యూజిక్ క్యాటగిరీలో పోటీపడుతోంది.
ఇక ఆస్కార్స్‌లో నాటు నాటు సాంగ్ రేసులో ఉంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ షార్ట్‌లిస్టులో ఆర్ఆర్ఆర్ పోటీపడుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

