RRR Collections | బాక్సాఫీస్ దగ్గర ‘ఆర్ఆర్ఆర్’ దండయాత్ర.. ఫస్ట్ వీక్‌లో రికార్డు కలెక్షన్లు
ప్రస్తుతం ఐపీఎల్‌ను మించిన క్రేజ్ దేనికైనా ఉందంటే అది 'అర్ఆర్ఆర్' అనే చెప్పచ్చు. ఈ చిత్రం విడుదలై వారం రోజులు దాటిన చాలా వరకు థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం
RRR Collections | ప్రస్తుతం ఐపీఎల్‌ను మించిన క్రేజ్ దేనికైనా ఉందంటే అది ‘అర్ఆర్ఆర్’ అనే చెప్పచ్చు. ఈ చిత్రం విడుదలై వారం రోజులు దాటిన చాలా వరకు థియేటర్లలో హౌజ్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ ప్రభంజనం సృష్టిస్తుంది. ఇప్పటికే పలు చోట్ల బాహుబలి రికార్డులను చెరిపివేసి తన పేరిట లిఖించుకుంది. రాజమౌళి టేకింగ్, విజన్‌కు యావత్ ప్రపంచ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తారక్, చరణ్‌ల నటనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. సౌత్ నుంచి నార్త్ వరకు ప్రతి సినీ ప్రేక్షకుడు ఈ చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే యూఎస్, నైజాంలలో బ్రేక్ ఈవెన్పూర్తి చేసుకుంది. ఇటీవలే నార్త్‌లో ఈ చిత్రం 100కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి బాలీవుడ్ విశ్లేషకులను సైతం ఔరా అనిపించేలా చేసింది. తాజాగా మొదటి వీకెండ్‌ను పూర్తీ చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్‌వీక్ కలెక్షన్లను ఏరియా వైజ్‌గా గమనిస్తే:
నైజాం : 77.30 కోట్లు
సీడెడ్ : 37.28 కోట్లు
ఉత్తరాంధ్ర : 21.00 కోట్లు
ఈస్ట్ : 11.65 కోట్లు
వెస్ట్ : 9.76 కోట్లు
గుంటూరు : 14.08 కోట్లు
కృష్ణ : 10.80 కోట్లు
నెల్లూరు : 6.45 కోట్లు
ఏపి+తెలంగాణ : 188.32 కోట్లు (281కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 33.10 కోట్లు
తమిళనాడు : 25.42 కోట్లు
హిందీ : 65.87 కోట్లు
కేరళ : 7.60 కోట్లు
ఓవర్సీస్ : 73.93 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 394.24 కోట్లు (715కోట్ల గ్రాస్)
‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి 451కోట్ల బిజినెస్ జరిగింది. ఫస్ట్ వీక్ పూర్తయ్యే వరకు ఈ చిత్రం రూ.394.24 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం మరో 56.76 కోట్లు సాధిస్తే క్లీన్ హిట్టుగా నిలిస్తుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ జోరును చూస్తుంటే రానున్న రెండు మూడు రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ను సాధించేలా కనిపిస్తుంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా, తారక్ కొమరం భీం పాత్రలో నటించాడు. ఆలీయాభట్, ఒలీవియా మొర్రిస్లు కథానాయికలుగా నటించారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని దానయ్య డివివి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు.
Read Also:
Radhe Shyam | ప్రభాస్ ‘రాధేశ్యామ్’ ఫైనల్ కలెక్షన్స్
Pawan Kalyan | ఆ యువ దర్శకుడితో వపన్ సినిమా చేయనున్నాడా?
Nani Dasara | భారీ ధరకు నాని ‘దసరా’ నాన్ థియేట్రికల్ రైట్స్?
Ghani | భారీ ధర పలికిన ‘గని’ నాన్-థియేట్రికల్ హక్కులు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

