Rowdyboys movie in OTT | కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా రౌడీ బాయ్స్. దిల్ రాజు వారసుడు, శిరీష్ తనయుడు ఆశిష్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించాడు. అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను హుషారు ఫేం శ్రీహర్ష కనుగంటి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆశిష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతున్నది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే ఓటీటీలో సందడి చేయబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ-5 యాప్‌లో మార్చి 4 నుంచి రౌడీ బాయ్స్ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ అయ్యంగార్, విక్రమ్, కార్తిక్ రత్నం, తేజ్ కురపాటి కీలకపాత్రల్లో నటించారు.