హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మాతలు. ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్రబృందం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
భావోద్వేగాలతో మనసుల్ని కట్టిపడేసే కథ ఇదని, కథను నమ్మి చేసిన సినిమా ఇదని, ఏప్రిల్ 12న సినిమా విడుదల చేస్తున్నామని నిర్మాతల్లో ఒకరైన బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. అవకాశం ఇచ్చిన బెక్కం వేణుగోపాల్‌కు దర్శకుడు విక్రమ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భావోద్వేగాలతో కూడిన వినోదాత్మక చిత్రం ఇదని, ప్రేమానుభూతిని అనుభవించిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ప్రధాన పాత్రధారులందరూ కృతజ్ఞతలు తెలిపారు.