హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రోటీ కపడా రొమాన్స్’. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్‌కుమార్ బొజ్జం నిర్మాతలు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ‘హను-మాన్’ఫేం తేజా సజ్జా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
‘ఈ సినిమా అందరినీ నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.. ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో చూడదగ్గర ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది. యువతరం మెచ్చేలా సినిమా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించకపోతే దర్శకత్వాన్ని విరమిస్తా.’ అని దర్శకుడు విక్రమ్‌రెడ్డి చెప్పారు. అన్ని ఉద్వేగాలు మిళితమై ఉన్న ప్రేమకథ ఇదని నిర్మాతలు తెలిపారు.