Roshan Kanakala | రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరోహీరోయిన్లు రోషన్ కనకాల, సాక్షిసాగర్ మదోల్కర్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా క్లాప్ ఇవ్వగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్క్రిప్ట్‌ని దర్శకుడికి అందించారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి.ఎం, సంగీతం: కాలభైరవ.