యువహీరో రోషన్ కనకాల నటిస్తున్న లవ్ యాక్షన్ ఎంటైర్టెనర్ ‘మోగ్లీ 2025’. ‘కలర్‌ఫొటో’ ఫేం సందీప్‌రాజ్ దర్శకుడు. పీపుల్‌మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
శనివారం హీరో రోషన్ కనకాల పుట్టినరోజు సందర్భంగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాకు చెందిన ఓ కొత్త పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. మాస్‌లుక్‌తో సీరియస్‌గా చూస్తూ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు రోషన్. అతని పాత్ర స్వభావాన్ని ఈ పోస్టర్ చెప్పకనే చెబుతున్నది. సాక్షి సాగర్ మడోల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ మారుతి ఎం., సంగీతం: కాలభైరవ.