రోహిత్ వర్మ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘పల్నాడు’. రియా సుమన్ కథానాయిక. గోవిందరెడ్డి చందా దర్శకత్వంలో క్రేజీ కింగ్స్ స్టూడియోస్ ఎల్ఎల్పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్ రివీల్ చేశారు.
ఎగసే నిప్పురవ్వల నేపథ్యంలో మండుతున్న కర్రను పట్టుకొని ఉన్న హీరో రోహిత్ వర్మ పవర్ఫుల్ లుక్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు. హరీష్ ఉత్తమన్, నవీన్ నేని, వినోద్‌కుమార్, దేవిప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవికుమార్.వి, సంగీతం: మణిశర్మ.