Rohini: బిగ్ బాస్ నుండి బుల్లితెర రాములమ్మగా..!

అదృష్ట దేవత ఎప్పుడు ఎవరి తలుపు తడుతుంతో చెప్పడం కష్టం. సినిమా ఇండస్ట్రీలో లక్ అనేది చాలా అవసరం . ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఓ సారి మంచి పాత్ర పడితే వారి పేరు మారుమ్రోగిపోవడం ఖాయం. బాహుబలిలో కాళకేయ పాత్ర పోషించిన ప్రభాకర్‌కి ఎంత ఫేమ్ వచ్చిందో మనం చూశాం. ఇక ఇప్పుడు బుల్లితెర ఆర్టిస్ట్ రోహిణి పేరు కూడా మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు చిన్న చిన్న సీరియల్స్‌లో నటించిన రోహిణి.. బిగ్ బాస్ షోతో హైలైట్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 3లో అడుగుపెట్టిన రోహిణి చిన్న కారణం వలన నాలుగో వారం ఎలిమినేట్ అయింది. ఆ వారం ఎలిమినేషన్ జోన్లో బాబా భాస్కర్, శ్రీముఖి, రోహిణి, రవి, రాహుల్ ఉండగా, రోహిణి ఎలిమినేట్ అయ్యింది. రోహిణి ఎలిమినేట్ కావడానికి ఒక రకంగా శివజ్యోతినే కారణం . నామినేషన్ టైంలో శివజ్యోతి, రోహిణిలు గుసగుసలాడటంతో రోహిణిని డైరెక్ట్‌గా ఎలిమినేషన్‌కి నామినేట్ చేశారు బిగ్ బాస్.
బిగ్ బాస్ తర్వాత రోహిణి పలు టీవీ షోస్‌తో బిజీ అయింది. జబర్ధస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాటిలో రోహిణి పర్ఫార్మెన్స్కి మంచి పేరు వస్తుంది. ఆగస్ట్ 29న ప్రసారం కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించి రీసెంట్గా ప్రోమో విడుదల చేయగా, ఇందులో విజయశాంతికి ట్రిబ్యూట్‌గా రాములమ్మ సినిమాకి సంబంధించిన ప్రదర్శన చేశారు. రోహిణి.. విజయశాంతిగా నటించింది. రామ్ ప్రసాద్.. రాం రెడ్డి పాత్ర పోషించారు. వీరిద్దరి పర్ఫార్మెన్స్కి ఇప్పుడు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తుంది.
విజయశాంతి పాత్రలో రోహిణి ఒదిగిపోయి నటించడంతో ఆమెకు బుల్లితెర రాములమ్మ అనే బిరుదు కూడా కట్టబెట్టారు నెటిజన్స్. ఇక రోహిణి పెర్ఫార్మన్స్ గురించి హైపర్ ఆది మాట్లాడుతూ.. సినిమాకి లేడీ సూపర్ స్టార్ అంటే విజయశాంతి.. టీవీకి సూపర్ స్టార్ అంటే రోహిణి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇదే షోలో పవన్‌కళ్యాణ్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ కూడా తెలిపారు. పవర్‌స్టార్ నటించిన సినిమాల్లోని పాటలకు స్టేజ్‌పై హుషారెత్తించేలా డ్యాన్స్ చేశారు. ఈ సెలబ్రేషన్స్‌లో నటి హేమతోపాటు ఇంద్రజ సైతం పాల్గొని.. అందర్నీ మెప్పించారు. ప్రోమోని బట్టి చూస్తుంటే షో ఆద్యంతం రక్తి కట్టించేలా కనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fine Rice | సన్నధాన్యం తన్నకుపోతున్నరు.. పచ్చి ధాన్యాన్నే కొంటున్న పొరుగు రాష్ర్టాల బ్రోకర్లు
Drugs | పల్లెల్లోకి డ్రగ్స్ మహమ్మారి.. విచ్చలవిడిగా వినియోగిస్తున్న యువత.. ఓ బాలికకు పలుమార్లు మత్తు ఇంజెక్షన్లు ?!
Revanth Reddy | సన్నబియ్యం కిలో రూ.95.. ఎల్ నినో ఎఫెక్ట్‌తోనే ధరలు పెరుగుతున్నాయి: రేవంత్‌రెడ్డి
Krishna Water | ఎవరి బాబు నీళ్లవి?… ఇటు 70 కిలోమీటర్లు ఎందుకు రావు.. అటు 700 కిలోమీటర్లు ఎట్ల పారినయ్
Horoscope | 23-10-2026 శుక్రవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

