Keshava Chandra Ramavath | జబర్తస్థ్ ఫేమ్, నటుడు రాకింగ్ రాకేశ్ కథానాయకుడిగా నటిస్తూ.. నిర్మిస్తున్న తాజా చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్). ఈ సినిమాకు ‘గరుడ వేగ’ అంజి దర్శకత్వం వహిస్తుండగా.. తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘తెలంగాణ తేజం’ అంటూ సాగే పాటను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. తెలంగాణలోని తండాలలో బ్రతికే ప్రజల జీవితాల నేపథ్యంలో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇంట్రెస్టింగ్గా సాగిన ఈ ట్రైలర్ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు లిరిక్స్ గోరేటి వెంకన్నతో పాటు కాసర్ల శ్యామ్ అందిస్తున్నారు. తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ బగవాన్, జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.