KCR | ‘ఈ సినిమాతో నాది రెండేళ్ల ప్రయాణం. దీనికి పార్ట్-2 కూడా ఉంటుంది. ఇదే టీం నుంచి మరో మంచి చిత్రంతో మీ ముందుకొస్తాం. మరో హిట్ కొడతాం’ అన్నారు రాకింగ్ రాకేష్. ఆయన హీరోగా గరుడవేగ అంజి దర్శకత్వంలో రూపొందిన ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు.
ఈ సందర్భంగా రాకింగ్ రాకేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. దర్శకుడు అంజి అన్న నేను తలెత్తుకునేలా సినిమా తీశాడు. నా భార్య సుజాత ఎంతో ధైర్యాన్నిచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాకు తప్పకుండా అవార్డ్స్ వస్తాయి. అప్పుడు గొప్ప పండగ చేసుకుంటాం. ఈ సినిమా ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది’ అన్నారు.
అభిమానులు విజిల్స్ వేసే మాస్ సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో తీరిందని సంగీత దర్శకుడు చరణ్‌అర్జున్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నాలుగోవారంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందని, టీమ్ సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని దర్శకుడు గరుడవేగ అంజి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.