Sreeleela | యువతరంలో మంచి క్రేజ్ ఉన్న కథానాయికల్లో శ్రీలీల ఒకరు. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ అచ్చ తెలుగు అందం భారీ చిత్రాల్లో అవకాశాలను సంపాదించుకొని సత్తా చాటింది. ప్రస్తుతం ఈ భామ నితిన్ సరసన ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నది. డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానుంది.
శుక్రవారం కథానాయిక శ్రీలీల పుట్టిన రోజుని పురస్కరించుకొని లేడీ బాస్ నీరా వాసుదేవ్‌గా ఆమె పాత్రను పరిచయం చేస్తూ వీడియో విడుదల చేశారు. ‘సునామీలో టీ సైలెంట్‌గా ఉండాలి. నా ముందు నువ్వు సైలెంట్‌గా ఉండాలి’ అని శ్రీలీల చెప్పిన డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శ్రీలీల కాస్త గర్విష్టి అయిన లేడీ బాస్‌గా కనిపిస్తుందని, నితిన్ క్యారెక్టర్‌కు పూర్తి భిన్నంగా ఆమె పాత్ర సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.