Nithiin Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇప్పటికే మువీ నుంచి టీజర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే నేడు రిపబ్లిక్ డే సందర్భంగా మూవీ నుంచి మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ మూవీలో నితన్ రాబిన్ హుడ్‌గా ఎలా మారాడో చూపించారు మేకర్స్.
ఈ సినిమా విషయానికి వస్తే.. నితిన్ ఇందులో రాబిన్ హుడ్ అనే దొంగ పాత్రలో నటిస్తున్నాడు. భారతీయులందరిని తన సోదరులు, సోదరీమణులుగా భావించి, వారి నుంచి డబ్బు దొంగిలిస్తుంటాడు నితిన్. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన సంఘటనలు ఏంటి.. అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక భీష్మ సినిమా తర్వాత నితిన్ ఈ కాంబోలో మరో హిట్ కొట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.