అక్సఖాన్, అలేఖ్యరెడ్డి, కిరణ్ ప్రధానపాత్రధారులుగా రూపొందిన సందేశాత్మక యాక్షన్ మూవీ ‘RK దీక్ష’. ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. త్వరలోనే సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘నిర్మాతగా నాకు ఇది 44వ సినిమా.
దర్శకునిగా 9వ సినిమా. మన జవాన్ల ధైర్యసాహసాలను, త్యాగాలను తెలియజేస్తూ తెరకెక్కించిన సందేశాత్మక యాక్షన్ సినిమా ఇది. ఇందులో పాటలూ, ఫైట్లు అన్నీ ఆకట్టుకుంటాయి. ‘దీక్ష’ విడుదలయ్యాక ‘మహిళా కబడ్డీ జట్టు’ మూవీని స్టార్ట్ చేస్తాం’ అని తెలిపారు. ఇంకా చిత్రబృందమంతా మాట్లాడారు. ఈచిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, సమర్పణ: డీఎస్‌రావు, నిర్మాణం: ఆర్కె ఫిల్మ్స్, సిగ్థ క్రియేషన్స్.