Ritika Nayak | ‘హను-మాన్’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అయితే రీసెంట్గా తేజా మల్టీస్టారర్ ఒకే చేసిన విషయం తెలిసిందే. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమా రానుండగా.. దీన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మంచు మనోజ్‌తో పాటు తేజా సజ్జా హీరోలుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో తేజా సజ్జాకు జోడీగా.. రితికా నాయక్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రితికా నాయక్‌తో చిత్రయూనిట్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. కాగా దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ ఇవ్వవలసి ఉంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో రితికా నాయక్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ‘హాయ్ నాన్న’ సినిమాలో కూడా మెరిసింది.