Raja Shivaji |నటుడిగా బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన రితేష్ దేశ్‌ముఖ్ ఇప్పుడు దర్శకుడిగా మారి తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 మే 1న, అంటే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచుతోంది. నటుడు అభిషేక్ బచ్చన్ ఈ పోస్టర్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంటూ, భారతదేశ గొప్ప యోధుడు, రాజు ఛత్రపతి శివాజీ మహారాజ్‌కి సినిమా రూపంలో నివాళి అర్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
రితేష్ దేశ్‌ముఖ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు, స్వయంగా ఛత్రపతి శివాజీ పాత్రను పోషిస్తున్నారు. ‘రాజా శివాజీ’ చిత్రం మరాఠీ, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంతో సహా ఆరు భాషల్లో రిలీజ్ కానుంది.
ప్రస్తుతం మహారాష్ట్రలోని ముంబై మరియు వాయ్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖ నటులు భాగం అవుతున్నారు. వారిలో సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, మహేష్ మంజ్రేకర్, సచిన్ ఖేడేకర్, భాగ్యశ్రీ, ఫర్దీన్ ఖాన్, జితేంద్ర జోషి, అమోల్ గుప్తే, జెనీలియా దేశ్‌ముఖ్, మరియు రితేష్ విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఉన్నారు.
జియో స్టూడియోస్ సమర్పణలో, జ్యోతి దేశ్‌పాండే మరియు జెనీలియా దేశ్‌ముఖ్ (ముంబై ఫిల్మ్ కంపెనీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయకమైన కథను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.
RITEISH DESHMUKH DIRECTS ‘RAJA SHIVAJI’ – WILL RELEASE IN MULTIPLE LANGUAGES ON 1 MAY 2026… #RajaShivaji – based on #ChhatrapatiShivajiMaharaj – is set to release worldwide on #MaharashtraDay: 1 May 2026.
Directed by #RiteishVilasraoDeshmukh, who also essays the titular role,… pic.twitter.com/HK4txIb54Q
— taran adarsh (@taran_adarsh) May 21, 2025