Kaushik Mekala | ‘ప్రియురాలు’ చిత్రం, అలాగే ‘జీ5’ ఓటీటీలో వచ్చిన ‘సిట్ (S.I.T)’ వంటి విభిన్నమైన ప్రాజెక్ట్‌లతో నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కౌశిక్ మేకల. కొత్త తరహా కంటెంట్‌ను ఎంచుకుంటూ, విభిన్న పాత్రలతో అలరిస్తున్న ఈ యువ నటుడు ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లతో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. ఇటీవల విడుదలైన ‘పార్ట్ టైమర్స్’ అనే డిజిటల్ సిరీస్‌లో కథానాయకుడిగా నటించి, తన సహజసిద్ధమైన నటనతో వీక్షకుల మనసులను గెలుచుకున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అద్భుతమైన ఆదరణతో డిజిటల్ స్పేస్‌లో దూసుకుపోతోంది.
కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితం కాకుండా ప్రకటనల రంగంలోనూ కౌశిక్ తన ముద్ర వేశారు. టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లతో కలిసి ప్రతిష్టాత్మక బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్లలో కనిపించి మెప్పించారు. ప్రస్తుతం కౌశిక్ కీలక పాత్రలో నటించిన “వైరల్ వీడియో” అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం నిర్మాణ ల్యాబ్ పనులను పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉండగా, యంగ్ అండ్ క్రేజీ డైరెక్టర్ల కాంబినేషన్లలో కౌశిక్ ప్రాజెక్ట్‌లు లైన్లో పడ్డాయి. ‘సైక్ సిద్ధార్థ్’ ఫేమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి దర్శకత్వంలో ఓ ఆసక్తికరమైన సినిమా చేయనున్నట్లు ఖరారైంది. అలాగే సీనియర్ దర్శకుడు జీవీ రామరాజు కాంబినేషన్లో హీరోగా పూర్తి చేసిన మరొక చిత్రం కూడా విడుదలకు శరవేగంగా సిద్ధమవుతోంది. ప్రసిద్ధ ‘ఫైన్ ఫ్రేమ్ ఫిల్మ్స్’ బ్యానర్‌పై రూపొందుతున్న మరొక ప్రతిష్టాత్మక చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై ఉంది. ఇవే కాకుండా మరో రెండు, మూడు వైవిధ్యమైన కథలు కూడా చర్చల దశలో ఉన్నాయని, వాటికి సంబంధించిన అధికారిక వివరాలను త్వరలోనే చిత్రబృందాలు వెల్లడించనున్నాయని సమాచారం. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న కౌశిక్ మేకల రాబోయే రోజుల్లో టాలీవుడ్లో మరింత కీలక స్థానాన్ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.