‘కాంతార’తో నటుడిగా రిషబ్‌శెట్టి పొటెన్షియాలిటీ ప్రపంచానికి తెలిసింది. అందుకే విభిన్నమైన పాత్రలు ఆయన తలుపు తడుతున్నాయి. ప్రశాంత్‌వర్మ ‘జై హనుమాన్’లో హనుమంతుడిగా ఆయన నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే హనుమంతుడిగా ఆయన ఫస్ట్‌లుక్‌ని కూడా విడుదల చేశారు. ఆ లుక్‌లో రిషబ్ని చూసిన జనం సాక్షాత్ ఆంజనేయుడ్నే చూసినట్టు రోమాంచితులవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ లోపే రిషబ్‌ను మరో వైవిధ్యమైన పాత్ర వరించడం విశేషం.
అది సాదాసీదా పాత్ర కాదు. మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ పాత్ర. సినిమా పేరు ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’. సందీప్‌సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఇది కేవలం సినిమా మాత్రమేకాదు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన శక్తిమంతమైన వ్యక్తి చరిత్ర. ఆ మహాయోధుడి కథను సినిమాగా తీసుకురావాలనేది నిజంగా గొప్ప ఆలోచన. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో నటిస్తున్నందుకు గౌరవంగా, గర్వంగా ఉంది. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పొందడానికీ.. శివాజీ గురించి తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండండి’ అని రిషబ్‌శెట్టి పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్, పోస్టర్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన ‘కాంతర’ ప్రీక్వెల్ చేస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.