Kantara| ఇటీవల విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతూ అన్ని భాషల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగా నటుడు రిషబ్ శెట్టి వివిధ రాష్ట్రాల్లో సక్సెస్ టూర్లు చేస్తూ.. ఈ సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా రిషబ్ శెట్టి బెంగళూరులో చిత్ర ప్రచారంలో బిజీగా ఉన్నారు. అక్కడున్న దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ను కలిశారు. మిస్టర్ 360గా పేరున్న ఏబీ డివిలియర్స్ ఇప్పుడు కాంతార ప్రొమోషన్స్కు తన వంతు చేయి కలిపాడు. కాంతార సినిమాకు ఎలివేషన్ ఇస్తూ.. సినిమాలో బాగా పాపులర్ అయిన సౌండ్‌ను రిషబ్‌తో కలిసి రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రిషబ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇది చూసిన నెటిజన్లు లైక్స్, కామెంట్స్‌తో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 15న తెలుగులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
It’s a Match!
Met the real 360 today.
The #Superhero is back to the roots again to #NammaBengaluru.. 🤩#Kantara @RCBTweets @ABdeVilliers17 @VKiragandur @shetty_rishab @hombalefilms @gowda_sapthami@HombaleGroup @AJANEESHB @actorkishore @KantaraFilm pic.twitter.com/LUfovEcn0h— Rishab Shetty (@shetty_rishab) November 3, 2022