Rishab Shetty | కాంతార సినిమాలో రిషభ్ శెట్టి నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఇటీవల ఒక సినిమా వేడుకలో ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. కాంతారలోని పంజూర్లీ దేవతను ఇమిటేట్ చేశాడు రణ్వీర్. అయితే రణ్వీర్ అలా చేయడంపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదరగా.. రణ్వీర్ దీనిపై క్షమాపణలు చెప్పాడు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు నటుడు రిషభ్ శెట్టి. సినిమా వేడుకలో కాంతారలోని సన్నివేశంను రణ్వీర్ ఇమిటేట్ చేయడం తనను ఇబ్బంది పెట్టిందని తెలిపాడు.
కాంతార’ వంటి చిత్రాన్ని తీయడం అనేది కొంతవరకు రిస్క్‌తో కూడుకున్న పని. ఈ సినిమాలో మేము దైవ అంశాలను జోడించాం. సినిమాలో అధిక భాగం సినీమాటిక్, నటనకు సంబంధించిన అంశాలు ఉన్నప్పటికీ, ‘దైవ’ అంశం చాలా సున్నితమైనది మరియు పవిత్రమైనది. అందుకే నేను ఎక్కడికి వెళ్లినా కాంతారలోని ఆ దైవ నృత్యాన్ని (భూత కోల) వేదికలపై ప్రదర్శించవద్దని లేదా ఎగతాళి చేయవద్దని (Mock it) ప్రజలను అభ్యర్థిస్తాను. ఈ అంశం మాకు భావోద్వేగంగా చాలా లోతుగా ముడిపడి ఉంది అందుకే రణ్వీర్ అలా చేసేసరికి కొంచెం బాధ కలిగించిందంటూ రిషభ్ చెప్పుకోచ్చాడు.