‘కాంతార: చాప్టర్ 1’లో మా ఊరంతా భాగమైంది
‘కాంతార’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు కన్నడ అగ్ర హీరో రిషబ్ శెట్టి. దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ పానిండియా రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతున్నది.
‘కాంతార’ ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు పొందారు కన్నడ అగ్ర హీరో రిషబ్ శెట్టి. దసరా సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ పానిండియా రికార్డులను అధిగమిస్తూ దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ సినిమా 500కోట్ల మార్క్‌ని దాటడం విశేషం. రిషబ్ శెట్టిలోని దర్శకుడికీ, నటుడికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఆయన విలేకరులతో ముచ్చటించారు..
- స్వతహాగా నాకు జానపద కథలు ఇష్టం. ఇండియా జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయంతో మరిన్ని జానపద కథలు వచ్చేందుకు మార్గం సుగమమైంది. ‘కాంతార’ మా ప్రాంతంలో నిజంగా జరిగిన కథ. అందుకే అక్కడే సినిమా తీశాను. ఇది చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. తెరకెక్కించడం నిజంగా పెద్ద ఛాలెంజ్. నిర్మాణంలో ప్రతి రోజూ ఓ ఛాలెంజ్‌గానే గడిచింది. ఈ సినిమా కోసం మా ప్రాంతంలో ప్రత్యేకమైన స్టూడియోను కూడా ఏర్పాటు చేశాను. చిన్నప్పట్నుంచీ మా ఊళ్లో సినిమా చేయాలని నా కోరిక. అది ‘కాంతర’ ఫ్రాంచైజీతో నెరవేరింది. మా ఊరివాళ్లంతా ఈ ప్రాసెస్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. నేను స్టార్‌గా ఎదిగినా నాలోని దర్శకుడ్నే ఇష్టపడతాను. దర్శకత్వానికే తొలి ప్రాధాన్యతనిస్తాను.
- అజనీష్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి అదనపు బలం. ట్రైబల్ ఏరియాలకు వెళ్లి అక్కడి ఒరిజినల్ స్కోర్‌ని రికార్డ్ చేసి, ఈ సినిమాకు ఉపయోగించాడు. హోంబలే వారు ఇచ్చిన సపోర్ట్ కూడా సాధారణమైనది కాదు. నిర్మాతలుగానే కాక, వ్యక్తిగతంగా కూడా మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వారి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. ప్రస్తుతం ‘కాంతార: చాప్టర్ 1’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నా. తర్వాత కొంత విశ్రాంతి తీసుకొని జనవరి నుంచి ‘జై హనుమాన్’ షూటింగ్లో జాయిన్ అవుతా. దర్శకుడిగా కొన్ని కథల్ని సిద్ధం చేస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

