రియా సింఘా, సత్య, వెన్నెల కిషోర్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా కథానాయికగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నది.
బుధవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రియా సింఘా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నది. యాక్షన్, కామెడీ అంశాలు కలబోసిన ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కథ, స్క్రీన్‌ప్లే: రితేష్ రానా, జయేంద్ర ఎరోలా, దర్శకత్వం: రితేష్ రానా.