RGV | ఆ సినిమా పూర్తిగా కాపీ.. ‘శివ’పై ఆర్జీవీ ఆసక్తికర కామెంట్స్
RGV | రామ్ గోపాల్‌వర్మ.. వెండితెరకు ‘శివ’ వంటి అద్భుతమైన హిట్లు అందించిన ఈ వివాదాస్పద దర్శకుడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా బ్రూస్లీ

రామ్ గోపాల్‌వర్మ.. వెండితెరకు ‘శివ’ వంటి అద్భుతమైన హిట్లు అందించిన ఈ వివాదాస్పద దర్శకుడు తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమా బ్రూస్లీ నటించిన ఒక సినిమాకు పూర్తిగా కాపీ అని వెల్లడించాడు. బ్రూస్లీ సినిమాలో రెస్టారెంట్లో గొడవలు జరిగితే, తాను ఆ ప్రాంతాన్ని కాలేజ్‌గా మార్చానని చెప్పాడు.
తాజాగా ఆర్జీవీ తెరకెక్కించిన ‘లడ్కీ’ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే శివ సినిమా గురించి మాట్లాడాడు. బ్రూస్లీ అంటే కేవలం ఒక మార్షల్ ఆర్టిస్ట్ కాదని, అతనిలో నిగూఢంగా ఫిలాసఫీ ఉందని అన్నాడు. అందుకే తనకు బ్రూస్లీ అంటే చాలా ఇష్టమని వివరించాడు.
తను తెరకెక్కించిన ‘లడ్కీ’ చిత్రం ఆ ప్రఖ్యాత మార్షల్ ఆర్టిస్ట్‌కి తన నివాళి అని తెలిపాడు. ఈ సినిమాలో హీరో పాత్రకు యువతిని తీసుకోవడానికి కారణాన్ని కూడా ఆర్జీవీ చెప్పాడు. ‘నేను అభిమానంచే ఆ మనిషికి మరే మగాడూ సరితూగడు. అందుకే ఈ చిత్రంలో అమ్మాయిని ప్రధాన పాత్రకు తీసుకున్నా’ అని వెల్లడించాడు.
ఈ చిత్రాన్ని ‘డ్రాగన్ గర్ల్’ పేరిట చైనాలో కూడా విడుదల చేస్తున్నారు. గల్వాన్ లోయ ఉద్రిక్తతల తర్వాత చైనాలో విడుదలవుతున్న తొలి భారతీయ సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రం కోసం చైనాకు చెందిన కంపెనీతో కలిసి ఆర్జీవీ పనిచేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

