Indiana Jones | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అంశంపై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Verma) స్పందించారు.
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ యాక్షన్, అడ్వెంచరస్ మూవీ ‘ఇండియానా జోన్స్’ (Indiana Jones) గుర్తుందా.. ఈ మూవీ టైటిల్లో ఇండియా ఉండడం వలన ఇకనుంచి ఈ మూవీని భారత్నా జోన్స్ అని పిలవాలని రామ్ గోపాల్ వర్మ ట్విట్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
— Ram Gopal Varma (@RGVzoomin) September 6, 2023
ఇండియానా జోన్స్’ (Indiana Jones) చిత్రాలలో మొదటి భాగం 1981లో ‘ఇండియానా జోన్స్ అండ్ రైడర్స్ ఆఫ్ ద లాస్ట్ ఆర్క్’ (Indiana Jones and the Raiders of the Lost Ark) పేరుతో రాగా.. తర్వాత 1984 లో ఇండియానా జోన్స్ అండ్ టెంపుల్ ఆఫ్ డూమ్ (Temple of Doom), 1989లో లాస్ట్ క్రూసేడ్ (Last Crusade), 2008లో కింగ్డమ్ ఆఫ్ ది క్రిస్టల్ స్కల్(Kingdom of the Crystal Skull) చిత్రాలు వచ్చాయి. కాగా.. దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ (Steven Spielberg) దర్శకత్వంలో వచ్చిన ఈ నాలుగు సినిమాలు ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.
ఈ సిరీస్ చిత్రాలలో ఇండియానా జోన్స్‌గా హారిసన్ ఫోర్డ్ (Harrison Ford) నటించారు. ఇక ఈ సినిమాలలో నిధిని కాపాడే వ్యక్తిగా జోన్స్ చేసే విన్యాసాలు, అడ్వెంచర్లు ప్రేక్షకుల్ని ఇప్పటికి మర్చిపోలేకుండా చేశాయి. ఇక హాలీవుడ్ ఆల్ టైం బాక్సాఫీస్ మూవీస్‌లో ఇండియానా జోన్స్ చిత్రాలు టాప్ టెన్‌లో ఉంటాయి. ఈ సిరీస్‌లో భాగంగా 1984లో వచ్చిన ఇండియానా జోన్స్ మరియు టెంపుల్ ఆఫ్ డూమ్ ( Indiana Jones and the Temple of Doom) అనే చిత్రం భారత్ (India)లో షూటింగ్ జరుపుకోగా.. ఈ సినిమాలో ఇండియన్ లెజెండరీ నటుడు అమ్రీష్ పురి (Amrish Puri) విలన్‌గా నటించాడు. ఈ చిత్రం ఇండియాలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. టెంపుల్ ఆఫ్ డూమ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన కే హుయ్ క్వాన్ (Ke Huy Quan) రీసెంట్గా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once) అనే సినిమాకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు.