Renu Desai | రేబిస్ టీకా తీసుకున్న రేణు దేశాయ్.. వీడియో
Renu Desai | ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ (Renu Desai) జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అందరికీ తెలిసిందే.
Renu Desai | ప్రముఖ నటి, నిర్మాత రేణు దేశాయ్ (Renu Desai) జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆమె రేబిస్ టీకా (Rabies Vaccine) తీసుకుంది. తాను టీకా తీసుకుంటున్న ప్రక్రియను వీడియో రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పంచుకుంది. సాధారణంగా టీకాలు తీసుకున్నప్పుడు ఫోటోలు లేదా వీడియోలు రికార్డ్ చేయని రేణు దేశాయ్.. ఈసారి మాత్రం అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ఇలా చేశానని తెలిపింది.
నేను రేబిస్ టీకా తీసుకుంటున్నప్పుడు రికార్డ్ చేయడం ఇదే మొదటిసారి. గతంలో తీసుకున్నప్పుడు నేను ఫోటోలు లేదా వీడియోలు తీయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ సమయానికి టీకా తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలియజేయడానికి ఈసారి షేర్ చేయాలనిపించింది అని రేణు వెల్లడించింది. జంతువులను పెంచుకునే వ్యక్తులు, పశువైద్యులు తప్పనిసరిగా తమ టీకా రికార్డులను నిర్వహించుకోవాలని, ఇంజక్షన్లు నిర్ణీత సమయానికి తీసుకుంటున్నారో లేదో నిర్ధారించుకోవాలని రేణు దేశాయ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

