బాబు పెదపూడి హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘రివెంజ్’. నేహదేశ్ పాండే హీరోయిన్. రెట్టడి శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ను గురువారం ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్.శంకర్ మాట్లాడుతూ ‘రివెంజ్ దర్శకుడు నాకు మంచి మిత్రుడు. మద్రాస్ నుంచి ఇద్దరి జర్నీ ప్రారంభమైంది. సినిమా అంటే ప్రాణంగా బతికే వ్యక్తి.
ఈ సినిమాతో తనలో వున్న మరో కోణాన్ని మనకు పరిచయం చేయబోతున్నాడు. ట్రైలర్ బాగుంది. సినిమా కూడా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరభద్రమ్ చౌదరి, హీరో, నిర్మాత బాబు, కథానాయిక నేహదేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.