‘ధమాకా’తో వందకోట్ల సక్సెస్ అందుకున్న దర్శకుడు నక్కిన త్రినాథరావు ఈ నెల 26న ‘మజాకా’తో రానున్నారు. సందీప్‌కిషన్, రీతు వర్మ జంటగా రూపొందుతోన్న ఈ మాస్ ఎంటైర్టెనర్కు రాజేష్ దండా, ఉమేష్ కేఆర్ బన్సాల్ నిర్మాతలు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ శుక్రవారం ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో సందీప్‌కిషన్, రీతు వర్మ ైస్టెలిష్ అండ్ కలర్ఫుల్గా డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని పంచుతుందని, త్రినాథరావు నక్కిన ఆద్యంతం హాస్యప్రధానంగా ఈ సినిమాను మలిచారని మేకర్స్ తెలిపారు. రావురమేష్, అన్షు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: నిజార్ షఫీ, సంగీతం: లియోన్ జేమ్స్, సహనిర్మాత: బాలాజీ గుత్తా, నిర్మాణం: ఏకే ఎంటైర్టెన్మెంట్స్, హాస్య మూవీస్.