రంగంలోకి ‘ఎల్లమ్మ’
తెలంగాణ గ్రామదేవతల నేపథ్యంలో ఆధ్యాత్మిక, మార్మిక అంశాల కలబోతగా రూపొందిస్తున్న డివైన్ ఎంటర్టైనర్ ‘ఎల్లమ్మ’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ నగర శివారులో మొదలైనట్లుగా సమాచారం.
తెలంగాణ గ్రామదేవతల నేపథ్యంలో ఆధ్యాత్మిక, మార్మిక అంశాల కలబోతగా రూపొందిస్తున్న డివైన్ ఎంటర్టైనర్ ‘ఎల్లమ్మ’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్ నగర శివారులో మొదలైనట్లుగా సమాచారం. ‘బలగం’ వంటి ప్రశంసాత్మక చిత్రం తర్వాత దర్శకుడు వేణు యెల్డండి రూపొందిస్తున్న ఈ సినిమా నిర్మాణ దశలోనే ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ సినిమా ద్వారా ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ కథానాయకుడిగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అగ్ర నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్గ్లింప్స్కు అద్భుతమైన స్పందన లభించడంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రకాష్‌రాజ్‌తో పాటు కొందరు ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారని, దేవిశ్రీప్రసాద్ త్వరలో ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

