హీరో నాని సినిమాకీ సినిమాకీ మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకోవట్లేదు. యమ స్పీడ్‌తో సినిమాలు చేసుకుపోతున్నాడు. ‘హాయ్ నాన్న’ షూటింగ్‌ను పూర్తి చేసేసి ‘సరిపోదా శనివారం’ షూటింగ్లో బిజీ అయిపోయాడు నాని. మంగళవారం హైదరాబాద్‌లో ఈ సినిమా షెడ్యూల్ యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభమైంది. రామ్‌లక్ష్మణ్ ఫైట్మాస్టర్ల నేతృత్వంలో పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే కొంత టాకీ పార్ట్ కూడా పూర్తిచేస్తామని దర్శకుడు వివేక్ ఆత్రేయ చెబుతున్నారు. నానితోపాటు ప్రధాన తారాగణమంతా ఈ షెడ్యూల్లో భాగం కానున్నారని ఆయన అన్నారు. ప్రియాంక అరుళ్మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి. సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాతలు: డి.వి.వి.దానయ్య, కళ్యాణ్ దాసరి.