రెండు దశాబ్దాల కిందట ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రెజీనా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నానని చెబుతున్నది. పర్సనల్ లైఫ్‌తోపాటు కెరీర్ పరంగానూ చాలా ఖుషీగా ఉన్నానంటున్నది.‘టీనేజ్‌లో ఉండగా సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో అక్కడి పరిస్థితులేం అర్థమయ్యేవి కావు. స్టార్డమ్ అంటే ఏంటో కూడా తెలిసేది కాదు. నటించడం అంటే ఓ సాహసకృత్యంగా భావించేదాన్ని. రోజులు గడిచేకొద్దీ సినిమా ప్రపంచం అర్థమైంది. నన్ను నేను కూడా అర్థం చేసుకున్నాను.
ఒకసారి సెలెబ్రిటీ హోదా వచ్చాక వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసొచ్చింది’ అని చెప్పుకొచ్చింది రెజీనా. మన అభివృద్ధికి సాయపడిన వారిని తలుచుకోవడం మానవ ధర్మం అంటుందామె. ‘ఇవాళ నేను ఈ స్థితిలో ఉండటానికి కారణమైన వారినందరినీ ప్రతిరోజూ గుర్తు చేసుకుంటాను. దాన్ని నా బాధ్యతగా భావిస్తాను. రోజూ భోజనానికి ముందు అలారం పెట్టుకొని మరీ అందరి గురించి ప్రార్థిస్తాను. మొదట్లో చూసినవాళ్లకు కృతకంగా అనిపించేది. కానీ, ఇప్పుడది నా దినచర్యలో భాగమైంద’ని చెబుతున్నది రెజీనా. సినిమాలతోపాటు వరుసగా వెబ్‌సిరీస్ అవకాశాలు వస్తుండటంతో నటిగా ఎంజాయ్ చేస్తున్నానని అంటున్నది.