కథానాయిక రెజీనా వరుస సినిమాలతో బిజీగా ఉంది. దక్షిణాది చిత్రాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సత్తా చాటుతున్నది. తాజాగా ఆమె హిందీలో ఓ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లో నటిస్తున్నది. నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి రషీక్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
దేశంలో జరిగిన అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని, ఇందులో రెజీనా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. రెజీనా తమిళంలో బోర్డర్, ఫ్లాష్‌బ్యాక్, సూర్పనగై చిత్రాల్లో నటిస్తున్నది.