Skanda Trailer | మాస్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బోయపాటి శ్రీను (Boyapati Srinu). ఈ స్టార్ డైరెక్టర్ అఖండ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించాడు. ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) సినిమా అంటే క్లాస్, మాస్, యాక్షన్, కామెడీ..అన్ని ఎలిమెంట్స్ ఉండాల్సిందే. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
రామ్-బోయపాటి కాంబోలో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద (Skanda). RAPO20గా వస్తున్న ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. స్కందలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ మరో ఫీ మేల్ లీడ్‌రోల్స్ పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల ట్రైలర్ (Skanda Trailer) కు ఊహించని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. స్కంద ట్రైలర్ 50 మిలియన్లకుపైగా వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోయడం ఖాయమని ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూస్తే తెలిసిపోతుంది.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్, డుమ్మారే డుమ్మారే పాటలు నెట్టింట వ్యూస్ పంట పండిస్తున్నాయి. తాజాగా ఎస్ థమన్ కంపోజిషన్‌లో పల్లెటూరి అందాల నడుమ కుటుంబసమేతంగా కలర్ఫుల్గా సాగే డుమ్మారే డుమ్మారే పాట సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నట్టు లిరికల్ వీడియో సాంగ్‌తో తెలిసిపోతుంది. నీ చుట్టూ చుట్టూ, గండరబాయ్ పాటల్లో ఇరగదీసే డ్యాన్స్‌తో రామ్-శ్రీలీల బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేయబోతున్నారని తెలుస్తోంది.
స్కంద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే బోయపాటి టీం స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తూ.. అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అఖండ లాంటి బ్లా్క్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.
స్కంద ట్రైలర్‌కు రికార్డు వ్యూస్..
A Massive Milestone!!❤️🔥#SkandaTrailer rage hits 50 Million+ Views on YouTube💥
– https://t.co/iCeVlangrt#SkandaOnSep28 in Telugu, Hindi, Tamil, Malayalam & Kannada!❤️
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens… pic.twitter.com/7niyRGB99n
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 7, 2023
స్కంద ట్రైలర్..
స్కంద టైటిల్ గ్లింప్స్..
డుమ్మారే డుమ్మా సాంగ్..
గండరబాయ్ సాంగ్..
నీ చుట్టూ చుట్టూ సాంగ్..