Dhurandhar | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగిస్తూ, చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా వసూళ్లు అంచనాలకు మించి దూసుకుపోతున్నాయి. వీక్ డేస్ వసూళ్లు తగ్గే రోజుల్లో కూడా ‘ధురంధర్’ సంచలన సంఖ్యలను నమోదు చేస్తూ దేశంలోని అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలుస్తోంది. సాధారణంగా రెండవ సోమవారం గణనీయమైన వసూళ్ల తగ్గుదల ఉంటుంది. కానీ, ‘ధురంధర్’ రెండవ సోమవారం కూడా రూ. 31.80 కోట్లు వసూలు చేసి, మునుపెన్నడూ లేని రికార్డును నెలకొల్పింది. తాజాగా ఈ చిత్రం 11 రోజుల్లో రూ.396 కోట్లు వసూళ్లను రాబట్టి రూ.400 కోట్ల దిశగా దూసుకెళుతుంది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయికగా నటించగా.. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఉరి దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించాడు.
‘DHURANDHAR’: THE VICTORY MARCH CONTINUES – AHEAD OF ‘PUSHPA 2’, ‘STREE 2’, ‘CHHAAVA’ ON *SECOND MONDAY*… #Dhurandhar is on a record-smashing rampage, rewriting the boxoffice rulebook.
The film has posted phenomenal numbers on its *second Monday* [Day 11] – a day that… pic.twitter.com/MEUS1QdXmy
— taran adarsh (@taran_adarsh) December 16, 2025