Prabhas | ఇండియాలో నెంబర్ వన్ హీరో ఎవరు..? ఈ ప్రశ్నకు సమాధానంగా గతంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఇండియా నెం 1 హీరో అనిపించుకుంటున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమాతో వచ్చిన మార్కెట్ గాలివాటం కాదు అని నిరూపించుకునే పనిలో పడ్డాడు ప్రభాస్. చాలా జాగ్రత్తగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. బాహుబలి తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో కూడా హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రభాస్ కూడా జెండా పాతేశారు.
అంతేకాదు ఈయనతో సినిమాల కోసం కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, ఓం రౌత్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా లాంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ప్రభాస్ హీరోగా నటించే సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్నిబట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈయన ఒక్కో సినిమాకు 150 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ఇండియాలో ఇప్పటి వరకు సినిమాకు రూ.150 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ 150 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో రాధే శ్యామ్ జనవరి 14, 2022న విడుదల కానుంది. ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ కూడా 2022 లోనే విడుదల కానున్నాయి. కేవలం హీరోగానే కాకుండా సామాజిక బాధ్యత విషయంలో కూడా ప్రభాస్ అందరికంటే ముందున్నాడు. మొన్న ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన వాళ్లకు విరాళంగా కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇచ్చారు రెబల్ స్టార్. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఎండోర్స్మెంట్ విషయంలో కూడా ప్రభాస్ చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ ఆయనే బ్రాండింగ్ చేయడానికి కాస్త దూరంగా ఉన్నాడు. చేసే ప్రతి సినిమా కోసం ప్రాణం పెడుతూ బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయ్యేలా మేకోవర్ అవుతున్నారు ప్రభాస్. ఈ లక్షణాలన్నీ ఆయనను ఇండియాస్ నెంబర్ వన్ హీరో చేస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Radhe Shyam: రాధే శ్యామ్ నుండి మరో సాంగ్ విడుదల.. క్యూట్‌గా ఉన్న సోచ్లియా సాంగ్
Prabhas @ Rs 150 crores | హాట్ టాపిక్‌గా ప్రభాస్ రెమ్యునరేషన్..ఇదే నిజమైతే..?
ప్రభాస్ కు డార్లింగ్ అనే పేరు ఎలా వచ్చింది…?
అమ్మో ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా క్లైమాక్స్ కోసం అంత ఖర్చు పెట్టారా?
Prabhas | ప్రభాస్ టేస్టే వేరు.. వ్యానిటీ వ్యాన్ లో ప్రత్యేక సౌకర్యం ఇదే