Prabhas | ప్రభాస్ టేస్టే వేరు.. వ్యానిటీ వ్యాన్ లో ప్రత్యేక సౌకర్యం ఇదే
టాలీవుడ్ (Tollywood) హీరోలు వ్యానిటీ వ్యాన్ల (Vanity Van ) కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా వ్యానిటీ వ్యాన్లలో లగ్జరీ సౌకర్యాలు ఏర్పాటు చేయించుకుంటున్నారు.

టాలీవుడ్ (Tollywood) హీరోలు వ్యానిటీ వ్యాన్ల (Vanity Van ) కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా వ్యానిటీ వ్యాన్లలో లగ్జరీ సౌకర్యాలు ఏర్పాటు చేయించుకుంటున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తన వ్యానిటీ వ్యానులో సహజసిద్దమైన వెలుతురు కోసం సన్ రూఫ్ పీచర్ (sunroof feature) ను ఏర్పాటు చేయించుకున్నాడు. ఔట్ డోర్ లొకేషన్ లో షూటింగ్ కొనసాగుతున్నపుడు కృత్రిమ కాంతి కాకుండా బయట నుంచి వచ్చే వెలుతురును ఆస్వాదించడమంటే ప్రభాస్ కు చాలా ఇష్టమట. అందుకు అనుగుణంగా వ్యానిటీ వ్యాన్ ను కస్టమైజ్ చేయించుకున్నాడు ప్రభాస్.
వ్యానిటీ వ్యాన్ లో ఏర్పాటు చేయించుకున్న స్పెషల్ ఫీచర్ కు సంబంధించిన ఫొటోను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావత్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. పనిలో ఉన్నపుడు కూడా ప్రకృతికి దగ్గరగా ఉండటం గొప్ప విషయం అంటూ ప్రభాస్ ను ప్రశంసించాడు ఓం రావత్. తానాజీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓం రావత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుంది.

ఈ మూవీలో ప్రభాస్ లో రాముడి పాత్రలో కనిపించనుండగా..బాలీవుడ్ భామ కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్రలో కనిపించబోతున్నాడు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవ్‌దత్తా నగే హనుమంతుడి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్లో అగ్రభాగం స్పెషల్ గా వేసిన సెట్స్ లో పూర్తి కానుంది.
ఇవి కూడా చదవండి..
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

