Family Star | ఈ రోజుల్లో ఒక సినిమా టీజర్ ఈ టైంకు విడుదలవుతుంది అని చెప్పిన తర్వాత.. అది రాకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా ఉండదు. గతంలో సాహో, ఆదిపురుష్, ఆచార్య లాంటి సినిమాలకు ఈ చేదు అనుభవం ఎదురైంది. వాళ్లు చెప్పిన సమయానికి టీజర్, ట్రైలర్ విడుదల చేయకపోవడంతో సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఆడుకున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగిందిప్పుడు. ఈయన సినిమా టీజర్ మార్చి 4 సాయంత్రం 6:30 కు వస్తుందని ముందు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తూచ్ అంటూ మరో రెండు గంటలు దాన్ని పొడిగించారు. 8:19 టీజర్ విడుదల చేస్తామని చెప్పగా.. అభిమానులు దానికోసం వెయిట్ చేస్తూ కూర్చున్నారు. కానీ ఎంతకీ టీజర్ రాకపోవడంతో వాళ్లలో అసహనం పెరిగిపోయి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది.
ఇంత చిన్న విషయం కూడా చూసుకోకపోతే ఎలా.. చెప్పిన సమయానికి టీజర్ విడుదల చేయలేమని అనుకున్నప్పుడు అసలు టీజర్ టైమింగ్ ఎందుకు చెప్పాలి అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే టీజర్ ఎట్టకేలకు రాత్రి 9:10 గంటలకు విడుదలైంది. వచ్చిన తర్వాత దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి చిత్ర యూనిట్ హ్యాపీగానే ఉన్నారు.. కానీ అసలు టీజర్ ఆలస్యానికి కారణం ఏంటి అనేది మాత్రం బయటికి రాలేదు. దీనికి ప్రత్యేకమైన రీజన్ ఉందని తెలుస్తోంది. నిజానికి ఫ్యామిలీ స్టార్ టీజర్ చూసిన తర్వాత నిర్మాత దిల్ రాజుకు పెద్దగా సాటిస్ఫై కాలేదని.. ఇంకో వర్షన్ ఉంటే బాగుంటుందని దర్శకుడితో డిబేట్ జరిగిందని తెలుస్తోంది. చివరి నిమిషం వరకు దాని కోసమే ట్రై చేసినట్టు ప్రచారం జరుగుతుంది.
అందుకే టీజర్ అనుకున్న దానికంటే 3 గంటలు ఆలస్యంగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. అయితే రాప్ సాంగ్‌తో వచ్చిన ఈ టీజర్‌కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరో నటిస్తున్న సినిమా విషయంలో కాస్తయినా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది కదా అనేది అభిమానుల నుంచి వస్తున్న కంప్లైంట్. ఇకపై చేయబోయే ప్రమోషనల్ కార్యక్రమాలు అన్నీ టైం 2 టైం చేయాలి అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మరి దీన్ని ఫ్యామిలీ స్టార్ ఎంతవరకు పట్టించుకుంటుంది అనేది చూడాలి..!