Tamannaah | అగ్ర కథానాయిక తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గత రెండేళ్లుగా రిలేషన్లో ఉన్న విషయం తెలిసిందే. ‘లస్ట్ స్టోరీస్-2’ వెబ్‌సిరీస్ కోసం పనిచేస్తున్న ఈ జంట ప్రేమలో పడ్డారు. తమ లవ్‌ఎఫైర్ గురించి అనేక సందర్భాల్లో ఈ జంట మాట్లాడారు. సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఈ జంట మనస్పర్థల కారణంగా విడిపోయారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుకు వృత్తిపరమైన అంశాల కారణమని అంటున్నారు.
కెరీర్‌కు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కావాలన్నది తమన్నా ఆలోచనగా ఉందని, విజయ్‌వర్మ మాత్రం పెళ్లి ప్రస్తావన లేకుండా మరికొంతకాలం నటనపైనే దృష్టిపె ట్టాలని నిర్ణయించుకున్నారని, ఈ నేపథ్యంలో వారిమధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్లో మీడియాలో కథనాలు వెలు వడ్డాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటివరకు ఈ జంట పెదవి విప్పలేదు. ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే అసలు వాస్తవం ఏమిటో తెలుస్తుందని, అంతవరకు ఈ వార్తలను గాసిప్స్‌గానే భావించాలని అభిమా నులు అనుకుం టున్నారు. ప్రస్తుతం తమన్నా తెలుగులో ‘ఓదెల-2’ సినిమాలో నటిస్తున్నది.