RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘ఆర్సీ 17’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఎప్పుడు జరగనుంది? ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా? లేక అనిరుధ్ రవిచందర్‌ను తీసుకుంటారా? అనే ప్రశ్నలకు నిర్మాత మైత్రీ రవి శంకర్ స్పందించారు.
RC 17 | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కనున్న కొత్త సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘ఆర్సీ 17’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఎప్పుడు జరగనుంది? ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కొనసాగుతారా? లేక అనిరుధ్ రవిచందర్‌ను తీసుకుంటారా? అనే ప్రశ్నలకు నిర్మాత మైత్రీ రవి శంకర్ స్పందించారు. దీంతో మెగా అభిమానుల్లో ఈ ప్రాజెక్టుపై ఆసక్తి మరింత పెరిగింది. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా వస్తుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారని ప్రచారం జరిగింది. అయితే అనుకున్న తేదీకి ప్రారంభోత్సవం జరగలేదు.
తాజాగా ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత మైత్రీ రవి శంకర్ ఈ విషయంపై స్పందించారు. దసరా రోజునే సినిమా ప్రారంభించాలని భావించామని, అయితే ముహూర్తం అనుకూలంగా లేదనే కారణంతో వాయిదా వేసినట్లు తెలిపారు. అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో మంచి ముహూర్తం చూసి సినిమా ప్రారంభోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే రామ్ చరణ్, సుకుమార్ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా సంగీత దర్శకుడి విషయంలో గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. సుకుమార్ సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం సాధారణంగా కనిపించే విషయం. వీరిద్దరి కలయికలో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాల పాటలు భారీ ఆదరణ పొందాయి.
అయితే ‘ఆర్సీ 17’ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో అనిరుధ్ రవిచందర్‌ను తీసుకునే అవకాశముందనే ప్రచారం నడుస్తోంది. దీనిపై నిర్మాత రవి శంకర్‌ను ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. సంగీత దర్శకుడి ఎంపిక పూర్తిగా దర్శకుడు సుకుమార్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గొప్ప సంగీత దర్శకుడని, ఆయనలో ఇప్పటికీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సంగీతాన్ని అందించే సామర్థ్యం ఉందని రవి శంకర్ ప్రశంసించారు. ఈ సినిమాలో ఆయన పనిచేయకపోతే తన స్థాయి తగ్గినట్లు భావించకూడదని అన్నారు. తమ నిర్మాణ సంస్థలో దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఏడు సినిమాలు చేశామని గుర్తుచేశారు. ఇన్నాళ్లూ ఒకే సంగీత దర్శకుడితో పనిచేసిన తర్వాత, మరో సంగీత దర్శకుడితో కలిసి పనిచేయాలని దర్శకులు భావించడంలో తప్పులేదని రవి శంకర్ అభిప్రాయపడ్డారు. అయితే ‘ఆర్సీ 17’ విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
Italy | పిల్లలు విధ్వంసానికి పాల్పడితే,తల్లిదండ్రులు పరిహారం చెల్లించాలి! ఇటలీ ప్రభుత్వం కొత్త నిబంధన
Delhi Pollution | ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

