Dhamka Movie | రవితేజ మాస్ కంబ్యాక్.. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ధమాకా..!
మాస్ మహరాజా రవితేజ 'ధమాకా'తో మాస్ హిట్టు కొట్టేశాడు. 'క్రాక్' తర్వాత వరుస డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Dhamka Movie Breakeven Completed | మాస్ మహరాజా రవితేజ ‘ధమాకా’తో మాస్ హిట్టు కొట్టేశాడు. ‘క్రాక్’ తర్వాత వరుస డిజాస్టర్లతో పట్టుకోల్పోయిన మార్కెట్‌ను మళ్లీ పుంజుకునేలా చేశాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత శుక్రవారం రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ టాక్‌తో సంబంధంలేకుండా భారీ కలెక్షన్లు సాధిస్తుంది. రవితేజ కెరీర్లో అత్యంత వేగంగా 40కోట్ల క్లబ్లో చేరిన సినిమాగా ధమాకా రికార్డు క్రియేట్ చేసింది. ఇక క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ పర్ఫార్మెన్స్తో అభిమానులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాడు.
కాగా తాజాగా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. రూ.18కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగిన ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ సాధించి బ్లాక్‌బస్టర్ దిశగా సాగుతుంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారంలో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ అయ్య చాన్స్ ఉంది. పైగా ఈ సినిమాతో పాటు రిలీజైన్ నిఖిల్ 18పేజీస్, విశాల్ లాఠీ, నయనతార కనెక్ట్ సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకుని ఫ్లాప్‌ల దిశగా సాగుతున్నాయి. అంతేకాకుండా వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. దాంతో ధమాకా మూవీ ఫుల్ రన్లో మంచి కలెక్షన్లు సాధించే చాన్స్ ఉంటుంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా, అభిషేక్ అగర్వాల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. రవితేజకు జోడీగా ‘పెళ్లి సందD’ బ్యూటీ శ్రీలీల నటించింది. రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్టు రావడంతో అటు రవితేజ, ఇటు ఆయన ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్‌లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

