Raviteja73 Movie | మాస్ రాజా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ధమాకాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన రవన్న.. అదే జోష్ ను తన తదుపరి సినిమాలో చూపించలేకపోయాడు. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం సాధించింది. పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ప్రస్తుతం రవితేజ ఆశలన్నీ టైగర్ నాగేశ్వరరావు సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై తిరుగులేని హైప్ తీసుకొచ్చాయి. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయెపిక్ గా తెరకెక్కుతుంది. దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
ఇక ఇదిలా ఉంటే తాజాగా రవితేజ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోను ను సోమవారం విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం రెండు రోజుల కిందే ప్రకటించింది. కాగా తాజాగా మరో ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమా టైటిల్ వీడియోను సాయంత్రం 6:03 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పీపుల్ మీడియా బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా జరుగుతుంది. ప్రతీకార నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తిక్ హాలీవుడ్ చిత్రం జాన్విక్ ఆధారంగా రూపొందిస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో రవితేజకు జోడీగా అనుపమ, కావ్య థాపర్ నటిస్తున్నారు.
This time MASS ascends to unprecedented altitudes 💥
Unveiling Mass Maharaja @RaviTeja_offl & @Karthik_gatta's#MASSiveEruption – #RT73 Title Announcement Video 🔥
Exploding Today at 6:03PM.Stay tuned 🥁@vishwaprasadtg @vivekkuchibotla@manibkaranam @sujithkolli pic.twitter.com/OqK6j4FA2b
— People Media Factory (@peoplemediafcy) June 12, 2023