రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ధమాకా’ తాజా షెడ్యూల్ యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభమైంది. శుక్రవారం నుంచి రామ్‌లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సెట్లో ఫైటర్స్, రవితేజ మధ్య పోరాట దృశ్యాలు రూపొందిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ…‘యాక్షన్ ఎపిసోడ్‌తో తాజా షెడ్యూల్ ప్రారంభించాం. పెద్ద సెట్లో చిత్రీకరణ జరుపుతున్నాం. సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ ఆకర్షణ అవుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు : ప్రసన్నకుమార్, సంగీతం : భీమ్స్, సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని.