Raviteja New Movie | మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) అప్‌కమింగ్ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు నటించబోతున్నారని అనే ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం స్పందించింది. రవితేజ – శివ నిర్వాణ కాంబోలో ఒక సినిమా రాబోతుండగా.. ఈ చిత్రంలో రవితేజ సరసన ఆరుగురు హీరోయిన్లు చేయబోతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తలపై చిత్రబృందం స్పందిస్తూ.. ఆ రూమర్స్‌ని తాజాగా ఖండించింది. మా రవితేజ – శివ నిర్వాణ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు ఉన్నారనే వార్తలన్నీ పూర్తిగా ఫేక్. అభిమానులు దయచేసి ఇలాంటి అనధికారిక వార్తలను నమ్మవద్దు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అధికారిక అప్డేట్ను మేమే త్వరలో వెల్లడిస్తాము అంటూ చిత్రబృందం వెల్లడించింది.
మరోవైపు ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ కుటుంబ కథా చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటించారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో రవితేజ స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రం విడుదలైన తర్వాతే శివ నిర్వాణ ప్రాజెక్ట్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.