నా కెరీర్లో అత్యంత దారుణమైన సినిమా అదే.. బాలయ్య టాక్ షోలో రవితేజ సెన్సేషనల్ కామెంట్స్

Raviteja | ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో దర్శకుడి హవా నడుస్తోంది. వాళ్ల టైమ్ నడిచినప్పుడు యావరేజ్ సినిమా తీసినా కూడా సూపర్ హిట్ అవుతుంది. అదే కాలం కలిసి రాలేదు అంటే పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది. ప్రస్తుతం దర్శకుడు శ్రీను వైట్ల టైమ్ ఇలాగే ఉంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేశాడు ఈయన. 1999లో రవితేజ హీరోగా వచ్చిన నీ కోసం సినిమాతో దర్శకుడిగా మారాడు శ్రీను వైట్ల. ఆ తర్వాత ఆనందం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే సొంతం, వెంకీ, ఢీ, రెడీ, కింగ్, దుబాయ్ శీను, దూకుడు, బాద్షా సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఆ తర్వాత శ్రీను వైట్ల టైం పూర్తిగా బ్యాడ్ అయిపోయింది.
మహేశ్ బాబుతో చేసిన ఆగడు నుంచి ఆయన కెరీర్ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత చేసిన బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి. ఇదంతా ఇలా ఉంటే తాజాగా రవితేజ ఈ దర్శకుడిని దారుణంగా అవమానించాడు. తనకు మూడు విజయాలు అందించిన శ్రీను వైట్ల సినిమా గురించి రవితేజ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యే బాలకృష్ణ unstoppable షోకు వచ్చిన రవితేజ.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టాక్ షో మధ్యలో కొన్ని ఫోటోలు చూపించిన బాలకృష్ణ.. వాటి గురించి అడిగాడు. అందులో అమర్ అక్బర్ ఆంటోనీ ఫోటో కూడా ఉంది. ఆ సందర్భంగా మాట్లాడుతూ తన కెరీర్లో అత్యంత రాడ్ రాంబోలా సినిమా ఇదే ఆంటూ చెప్పాడు. రాడ్డులకే రాడ్డు ఇది అంటూ చెప్పాడు మాస్ రాజా. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
2021లో సక్సెస్ ఫుల్ డెబ్యూ చేసిన హీరోలు వీళ్లే..
Samantha item song | టాప్ ఫామ్లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

