Mass Jathara | టాలీవుడ్ స్టార్ బ్యానర్ సితార ఎంటర్టైనమెంట్స్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో మూవీ నుంచి వరుస అప్డేట్లను చిత్రబృందం పంచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ను అక్టోబర్ 27న(సోమవారం) విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
#MassJatharaTrailer on 27th October 🔥#MassJathara #MassJatharaOnOct31st pic.twitter.com/9wrpJpeZRv
— Ravi Teja (@RaviTeja_offl) October 25, 2025